Thursday, July 30, 2026
E-PAPER
Homeఖమ్మంతనయుడిని ప్రభుత్వ బడిలో చేర్పించిన ప్రజాప్రతినిధి

తనయుడిని ప్రభుత్వ బడిలో చేర్పించిన ప్రజాప్రతినిధి

- Advertisement -

– ఆదర్శంగా నారాయణపురం సర్పంచ్ దంపతులు
– అభినందించిన ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని చాటుతూ నారాయణపురం గ్రామ సర్పంచ్ మడకం కుమారి–ఆంధ్రెయ్య దంపతులు తమ కుమారుడు రోహన్‌ను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రయివేట్ విద్యపై మోజు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడం అరుదైన సందర్భంగా నిలిచింది.

నారాయణపురం సర్పంచ్ దంపతులు విధి నిర్వహణలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తరచూ సందర్శిస్తూ బోధనా విధానాలు, పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన నాణ్యత వంటి అంశాలను పరిశీలించేవారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలపై విశ్వాసం ఏర్పడటంతో, ములకలపల్లి మండలం జగన్నాధపురంలోని వసతి గృహంలో ఉంటూ ఆరో తరగతి చదువుతున్న తమ కుమారుడు రోహన్‌ను బుధవారం నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సింగపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు సర్పంచ్ దంపతులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. ఇతర ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించి విద్యార్థులను చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు సర్పంచ్ దంపతులను అభినందించి, రోహన్‌ కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -