- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో గురువారం స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బంగారు మల్లన్న ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఆలయ కోశాధికారి అంగిరేకుల రమేష్, నూకల పెద్ద మల్లయ్య దంపతులు ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులు విజయవంతం కావాలని కోరుకుంటూ పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు సహాయ సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం పెద్దమనుషులు పెద్ద మల్లయ్య, అనిల్, సాయిలు నరేష్, శ్రావణ్, సంఘ సభ్యులు మల్లేష్, నరేష్, నూకల బుచ్చి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



