Thursday, July 9, 2026
E-PAPER
Homeజాతీయంమధుమేహ చికిత్సలో కొత్త అధ్యాయం

మధుమేహ చికిత్సలో కొత్త అధ్యాయం

- Advertisement -

భారత్‌లో వారానికి ఒక్కసారి తీసుకునేతొలి ఇన్సులిన్‌కు శ్రీకారం
రోజూ ఇంజెక్షన్ అవసరం లేకుండా ఏడాదికి 52 ఇంజెక్షన్లకే పరిమితం
భారత్‌‌లో ‘అవిక్లీ’ని విడుదల చేసిన నోవో నార్డిస్క్

న్యూఢిల్లీ : ప్రపంచంలో మధుమేహ చికిత్సలో కీలకమైన ముందడుగు పడింది. డెన్మార్క్‌‌కు చెందిన ఔషధ సంస్థ నోవో నార్డిస్క్‌ ప్రపంచంలోనే వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే బేసల్‌ ఇన్సులిన్‌ ‘అవిక్లీ’ను భారత్‌‌లో విడుదల చేసింది. రోజూ ఇన్సులిన్‌ ‌తీసుకో వాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ.. ఏడాదికి 365 ఇంజెక్ష‍న్ల స్థానంలో 52 ఇంజెక్ష‍న్లతోనే చికిత్స కొనసాగించే అవకాశాన్ని ఈ కొత్త ఔషధం కల్పి స్తుంది.శరీరంలో రక్తంలో ఉండే గ్లూకోజ్ (చక్కెర)ను కణాల్లోకి చేరవేసే హార్మోన్ ఇన్సులిన్. టైప్-1 మధుమేహం ఉన్నవారికి, అలాగే తీవ్రమైన దశలో ఉన్న టైప్-2 మధుమేహ రోగులకు ఇన్సులిన్ తప్పనిసరి. ఇప్ప టివరకు వీరిలో చాలామంది ప్రతిరోజూ లేదా రోజుకు ఒక్కసారికంటే ఎక్కువసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి ప్రత్యామ్నాయంగా నోవో నార్డిస్క్ ఇన్సులిన్ ఐకోడెక్ ఆధారంగా రూపొందించిన అవిక్లీను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం… 700 యూనిట్ల ప్యాక్ ధర రూ.2,611. అంటే యూనిట్‌కు సుమారు రూ.3.73 మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రోజువారీ బేసల్ ఇన్సులిన్‌తో పోలిస్తే ఇది 30 నుంచి 40 శాతం వరకు తక్కువ ధర. ఉదాహరణకు రోజుకు 10 యూనిట్ల ఇన్సు లిన్ అవసరమయ్యే రోగి, వారానికి 70 యూనిట్లు తీసుకుంటే సరిపో తుంది. దీనికి సుమారు రూ.261 మాత్రమే ఖర్చవుతుంది. ముంబ యికి చెందిన ప్రముఖ మధుమేహ నిపుణులు డాక్టర్ రాజీవ్ కోవిల్ మాట్లాడుతూ.. ఈ ఔషధాన్ని పోటీ ధరలో అందుబాటులోకి తీసుకు రావడం ఆశ్చర్యకరమని అన్నారు. క్లినికల్ పరీక్షల్లో రోజువారీ బేసల్ ఇన్సులిన్‌తో సమానమైన లేదా కొన్ని సందర్భాల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని వివరించారు.

భారత్‌‌కు కీలకం
భారత్‌లో ప్రస్తుతం సుమారు 10.1 కోట్ల మంది మధుమేహంతో, మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్‌తో జీవిస్తున్నారు. అదేవిధంగా తొమ్మిది లక్షల మందికి పైగా టైప్-1 మధుమేహ రోగులు ఉన్నారు. టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఇన్సులిన్ చికిత్స అవసరమవుతోంది. అయితే రోజూ ఇంజెక్షన్ తీసుకోవాలనే భయం, నొప్పి, చికిత్స క్లిష్టంగా అనిపించడం వంటి కారణాలతో చాలా మంది ఇన్సులిన్ చికిత్సను ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు ఆలస్యం చేస్తున్నారని నోవో నార్డిస్క్ తెలిపింది. అవిక్లీని ఫ్లెక్స్‌టచ్ అనే పెన్ పరికరం ద్వారా వారానికి ఒక్కసారి ఇస్తారు. దీంతో రోగులు చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించే అవకాశాలు పెరుగుతాయనీ, ఇన్సులిన్ ప్రారంభిం చడానికి వెనుకాడే వారి సంఖ్య తగ్గుతుందని వైద్యులు భావిస్తున్నారు. భారత్‌లో మధుమేహ నియంత్రణకు ఇది కొత్త దిశను చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -