యాంటీ స్పామ్ నిబంధనలపై వివాదం
న్యూఢిల్లీ : భారత టెలికాం నియంత్రణ మండలి (ట్రాయ్) విధించిన కొత్త యాంటీ స్పామ్ నిబంధనలపై ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసింది. 1400,1600 సిరీస్ నంబర్లను స్పామ్ అని గుర్తించకుండా ట్రాయ్ విధించిన ఆంక్షలు, వినియోగదారుల భద్రతకు ఆటంకంగా మారాయని ట్రూకాలర్ సీఈఓ రిషిత్ జున్‌జున్‌వాలా ఆరోపించారు. 2024లో అమల్లోకి వచ్చిన ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా వాణిజ్యపరమైన కాల్స్‌ను గుర్తించాలని ట్రాయ్ భావించినా.. అవే నంబర్ల ద్వారా మోసపూరిత కాల్స్ పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ అంతర్గత డేటా ప్రకారం.. గత ఎనిమిది నెలల్లో 1400 సిరీస్ కాల్స్‌ను 81 శాతం మంది, 1600 సిరీస్ కాల్స్‌ను 79 శాతం మంది వినియోగదారులు పట్టించుకోవడం లేదని ఈ నంబర్లను బ్లాక్ చేసే వారి సంఖ్య అక్టోబర్ 2025 నుంచి మూడు రెట్లు పెరిగిందని ఆయన వివరించారు. ఈ సిరీస్ నంబర్లను స్పామ్‌గా మార్క్ చేస్తున్నందుకు ట్రూకాలర్ వంటి యాప్‌లపై ఐటి చట్టం కింద చర్యలు తీసుకోవాలని ట్రాయ్ భావిస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఏ నిర్ణయమైనా ఆధారాలతో కూడి ఉండాలని, వినియోగదారుల రక్షణ కోసం పనిచేస్తున్న తమను కాకుండా, తప్పు చేసే వారిని శిక్షించాలని జున్‌జున్‌వాలా కోరారు. భారత్‌లో ట్రూకాలర్ 35 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. తదుపరి చర్యల కోసం తాము ఐటి మంత్రిత్వ శాఖతో డేటాను పంచుకుంటామని సంస్థ వెల్లడించింది.
ట్రాయ్‌తో ట్రూకాలర్ ఫైట్
- Advertisement -
- Advertisement -



