Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతాతా పూరీ.. ఓకే వేస్తా

తాతా పూరీ.. ఓకే వేస్తా

- Advertisement -

మనువడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్‌‌రెడ్డి
‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘తాతా.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా’ అని మనవడు అడిగితే తప్పుతుందా? తప్పకుండా వేయాల్సిందే. ఎంత పెద్ద పదవిలో ఉన్నా..ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా మనువడి కోరికకు జీ హుజూర్‌ అనాల్సిందే. మనువడి కోసం చెఫ్‌ అవతారం ఎత్తి ఆ ప్రేమలో మైమరిచిపోవాల్సిందే. నిత్యం రాజకీయాలతో బిజీగా బిజిగా ఉండే సీఎం ఎ.రేవంత్‌‌రెడ్డి చెఫ్‌ అవతారం ఎత్తారు. మనువడి కోసం పూరీలు చేసి గడిపిన ఆ మధుర క్ష‍ణాల వీడియోను ఎక్స్‌ ‌వేదికగా పంచుకున్నారు. సోషల్‌ ‌మీడియా వేదికగా అది చక్కర్లు కొడుతున్నది. తన మనవడు పూరీలు చేయమని కోరగా.. ఆయనే స్వయంగా తయారు చేశారు. ‘‘తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా’’ అని మనవడు అడిగితే తప్పుతుందా. పక్కన మనవడు.. చేతిలో పిడికెడు పిండి.. దోసిట్లోనవ్వులు.. గుండ్రంగా లేని డజన్‌ పూరీలు.. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో మనవడితో కలిసి పూరీలు వేస్తూ ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు’ అంటూ సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు.

​‘సీఎం : పూరీ అయింది చాలా
మనువడు : ఇంకా నాకు, అమ్మమ్మకు
సీఎం : నీకు చేసిన కదా?
మనువడు : మరి అమ్మమ్మకు, నాన్నకు వద్దా?
సీఎం : ఎట్లయిందో చూడురా..చాలా పెద్దగా అయింది
మనువడు : ఇది పెద్ద సర్కిల్‌ ‌కాదు..అది ఓవల్‌‌లాగా ఉంది
సీఎం : ఓవల్‌‌లాగా ఉందా? అయితే రౌండ్‌‌గా చేస్తా.
మనువడు : నాకైతే ఓవల్‌‌లాగే ఉంది. ఓవల్‌ ‌షేప్‌ ‌వచ్చింది. అగో చూడు
సీఎం : లేవకు. కూర్చో చిన్నయ్య
మనువడు : నేను తింటా కదా…
సీఎం : లేవొద్దు చిన్నయ్య..
ఇంకా రెండు, మూడు వేయాలి.
మనువడు : హే ఫ్లోట్‌ అవుతున్నది…ఫోట్‌ అవుతున్నది..తాతా..తాతా స్పూన్‌ ‌తీస్కో..అక్కడున్నది తీస్కో…’ అంటూ సాగిన మనువడి ముద్దుముద్దు మాటలకు సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రేమతో పరవశించిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది. ‘సార్‌ ‌మీరు నాకంటే చాలా బాగా చేస్తున్నారు. వంటింట్లో ఒక రాష్ట్ర సీఎంను చూడటం హ్యాపీగా ఉంది’…‘ఫ్యామిలీ కోసం కొంత సమయం’ అంటూ హ్యాష్‌ ‌ట్యాగ్‌ ‌చేస్తూ చాలా మంది పాజిజిట్‌ ‌కోణంలో పోస్టులు పెట్టారు. అయితే, కొందరు నెగెటివ్‌ ‌కోణంలోనూ పోస్టులను పెట్టడం కనిపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -