రూ. 7,345 కోట్లతో
జోన్-1 పనులకు గ్రీన్‌సిగ్నల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.7,345 కోట్లతో జోన్-1 పనులు చేపట్టేందుకు అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం ఏసియా డెవలంప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) రూ.4,500 కోట్ల రుణం ఇస్తోంది. ఆ నిధులతో బోర్డు ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. రూ.2,845 కోట్లు హెచ్‌ఎండీఏ లేదా టీజీఐఐసీ నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జోన్-1ఏలో హిమాయత్‌సాగర్-బాపూఘాట్ వరకు రూ.3,104 కోట్లతో 9.20 కి.మీ అభివృద్ధి చేయనున్నారు. జోన్-1బీలో ఉస్మాన్ సాగర్-బాపూఘాట్ వరకు రూ.3,950 కోట్లతో 11.80 కి.మీ అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ నియామకానికి ఎంఆర్‌డీసీఎల్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ భూములు, ప్రయివేటు భూములతో కలిపి మొత్తం రెండు వందల ఎకరాల్లో బాపూఘట్ త్రివేణి సంగమం వద్ద ‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు’ను అభివృద్ది చేయాలని నిర్ణయించింది. ఇటీవల గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ 83 ఎకరాలను ఇచ్చింది. అక్కడే గాంధీ సమాధి, మ్యూజియం నిర్మించనుంది. వంద మీటర్ల ఎత్తయిన టవర్, దానిపై 30 మీటర్ల గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. అందులో ఎడ్యుకేషన్ నాలెజ్జి హబ్, ధ్యాన మందిరం, నేషనల్ మ్యూజియం, పబ్లిక్ రిక్రియేషన్ స్పెసెస్, గాంధీ యూనివర్సిటీ, చేనేత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మొదటి దశ మూసీ ప్రాజెక్టు 21 కిలో మీటర్లు పూర్త చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మూసీ ప్రాజెక్టు మొదటి దశకుప్రభుత్వం అనుమతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


