Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిస్సేడ్ కాల్ అభియాన్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలి

మిస్సేడ్ కాల్ అభియాన్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలి

- Advertisement -

నీలం పద్మ కృష్ణవేణి
నవతెలంగాణ – ఆలేరు టౌన్

మిస్సైడ్ కాల్ అభియాన్ మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించాలని, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ మీటింగ్ నీలం పద్మ అధ్యక్షతన, ఆలేరు పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  ఆదేశాల మేరకు నెలవారి జిల్లా రివ్యూ మీటింగ్ జరుగుతుందని జిల్లాకు ఇన్చార్జిలుగా నియమింపబడిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి  మౌనిక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని, మిస్డ్ కాల్ అభియాన్, పోస్ట్ కార్డు పై సంతకాలు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉత్తరాలపై సంతకలు సేకరించామన్నారు.

మహిళా రిజర్వేషన్ 33% బిల్లు వెంటనే అమలు చేయాలని నారిశక్తి అది నియం మహిళా అరక్షన్ బిల్ ఆజ్ కరో అబికరో చాలు కరో నినాదంతో పోస్ట్ కార్డు. మిస్సేడ్ కాల్ పంపించడం జరుగుతుందని తెలిపారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేయాలని బిజెపి, బిఆర్ఎస్ అరాచకాలను తిప్పికొట్టాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని మహిళా అభివృద్ధికి  బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకు 6 గ్యారెంటీల తో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం. 500 కే గ్యాస్ సిలిండర్ గృహ అవసరాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సన్న బియ్యం రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

 మహిళా శక్తి పథకాల ద్వారా మహిళలు క్యాంటీలను పెట్టడానికి ఆర్థిక సహాయం మహిళలకు పెట్రోల్ బంకులు ఓనర్లుగా. ఆర్టీసీ బస్సు ఓనర్లుగా ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. అతివల ఆర్థిక స్వాలంబనని ప్రజా ప్రభుత్వం లక్ష్యం. ఇందిరా మహిళా శక్తి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ రాష్ట్ర రేవంతన్న ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి, స్టేట్  సెక్రెటరీ మౌనిక పి పావని, వివిధ విభాగాల చెందిన  మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -