Saturday, July 11, 2026
E-PAPER
Homeజాతీయంవణుకుతున్న ఉత్తరాది

వణుకుతున్న ఉత్తరాది

- Advertisement -

ముంచెత్తిన వర్షాలు.. విరిగిపడుతున్న కొండ చరియలు
డబుల్ ఇంజిన్ సర్కార్లు వచ్చినా వీడని వరద కష్టాలు

వణుకుతున్న ఉత్తరాది


న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో కొండచరియలు విరిగిపడడం తో పలువురు మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 160 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సూరత్‌లో రహదారులు జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.శుక్రవారం ఉత్తరాఖండ్‌ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగుతుండడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని పాఠశాలలను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. 75 రోడ్లు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయని.. 29 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది.అలాగే ఉ త్తరకాశి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో గంగోత్రి హైవే మూసుకుపోయి.. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చార్‌ధామ్ యాత్ర కు కొన్ని గంటలపాటు అంతరాయం కలిగింది.

ఉత్తర్‌ప్రదేశ్‌కు రెడ్‌ అలర్ట్‌
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా గాజియాబాద్‌, మేరఠ్‌, హాపూర్, బులంద్‌షహర్, బాఘ్‌పత్, ముజఫర్‌నగర్, మొరాదాబాద్ జిల్లాల్లోని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ..మీ కష్టాలు తీరుతాయన్న హామీలు నీటి మూటల్లానే మారిపోతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -