Saturday, July 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైల్వే ట్రాక్‌ పక్కన మగ శిశువు కాపాడిన రైల్వే సిబ్బంది

రైల్వే ట్రాక్‌ పక్కన మగ శిశువు కాపాడిన రైల్వే సిబ్బంది

- Advertisement -


నవతెలంగాణ- కృష్ణ
పుట్టిన వెంటనే మగ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌ పక్కన వదిలేశారు. ఈ అమానుష ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసింది. రైల్వే సిబ్బంది, పోలీసులు గమనించి కాపాడారు. ఉదయం ఐదు గంటల సమయంలో రైల్వే ట్రాక్‌ సమీపంలో నుంచి శిశువు ఏడుపు వినిపించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న రైల్వే కార్మికుడు గమనించి.. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. రైల్వే పోలీస్‌ మునిస్వామి ఘటనా స్థలానికి వచ్చారు. శిశువును అంబులెన్స్‌లో మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం పసికందు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత రైల్వే పోలీసులు శిశువును జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -