డెకరేషన్ సామగ్రి
గోదాంలో చెలరేగిన మంటలు
భారీగా ఆస్తి నష్టం
నవతెలంగాణ – చార్మినార్
హైదరాబాద్‌లోని పాతబస్తీ చాదర్‌ఘాట్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూసీ నది సమీపంలో ఉన్న డెకరేషన్ సామగ్రి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగగా క్షణాల్లోనే మొత్తం అగ్నికి ఆహుతైంది. భారీ ఎత్తున ఎగిసిపడిన అగ్నిజ్వాలలు, దట్టమైన నల్ల పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాంలో వివాహాలు, శుభకార్యాలు, ఉత్సవాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ అలంకరణ వస్తువులు, థర్మాకోల్, డెకరేషన్ క్లాత్, కృత్రిమ అలంకరణ సామగ్రి తదితర సులభంగా మంటలు అంటుకునే వస్తువులు నిల్వ ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపు లోకి తెచ్చింది. మంటలు సమీప భవనాలకు వ్యాపించకుండా నివారించింది. ప్రమాద సమ యంలో గోదాంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తరలించడంతో ప్రాణనష్టం జరగలేదు. అయితే గోదాంలోని సామగ్రి పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవిం చినట్టు తెలుస్తోంది. నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొ చ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


