Saturday, July 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంన్యూజిలాండ్ లో ప్రధాని మోడీ

న్యూజిలాండ్ లో ప్రధాని మోడీ

- Advertisement -

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతంపై
ప్రధాని ఆశాభావం

ఆక్లాండ్ : మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ న్యూజిలాండ్‌ చేరుకున్నారు. ఆక్లాం డ్‌కు చేరుకున్న కొద్దిసేపటికే తన న్యూజిలాండ్ పర్యటనను చరిత్రాత్మ కమైనదిగా మోడీ అభివర్ణించారు. ప్రధాని మోడీకి న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఇరు దేశాధినేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికినందుకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. నాలుగు దశాబ్దాల్లో న్యూజిలాండ్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంపై న్యూజిలాండ్ ప్రధాని లక్సన్‌తో జరగనున్న చర్చలు, ఆక్లాండ్‌లో జరగనున్న సామాజిక కార్యక్రమం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోడీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -