Friday, July 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆర్థిక స్తోమత వుంటే రెడీ !

ఆర్థిక స్తోమత వుంటే రెడీ !

- Advertisement -

పెండ్లి చేసుకుని, పిల్లలను కనడానికి యువత సుముఖత: యూఎన్‌ జనాభా నిధి వెల్లడి
ఐక్యరాజ్య సమితి : ఆర్థికంగా స్తోమత కలిగి వుంటే పెండ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి ప్రపంచవ్యాప్తంగా యువత సుముఖంగా వున్నారని ఐక్యరాజ్య సమితి కొత్త నివేదిక వెల్లడించింది. ‘‘లైవ్స్‌, చాయిసెస్‌, ఫ్యూచర్స్‌ : యువత కోరుకునేది ఏమిటి, సంబంధాలు, తల్లిదండ్రులు కావడానికి సంబంధించిన వారి నిర్ణయాలను ప్రభావితం చేసేదేమిటి.’’ అనే శీర్షికతో ఈ నివేదికను బుధ వారం విడుదల చేశారు. మూడింట రెండు వంతుల మంది కంటే ఎక్కువ మంది వివాహంతో కూడిన ఆదర్శవంతమైన సంబం ధాన్ని, జీవన విధానాన్ని ఎంచుకున్నారని యుఎన్‌ ‌పాపులేషన్‌ ‌ఫండ్‌ (‌యూఎన్‌ఎఫ్‌‌పీఏ) నివేదిక పేర్కొంది. 2025-26 సంవత్సరానికి జనాభా సంబంధిత భవిష్యత్‌ ‌సర్వే వివరాల ప్రాతిప దికన ఈ నివేదికను రూపొందించారు. 73 దేశాలు, ప్రాంతాల వ్యాప్తంగా,18-39 ఏండ్ల మధ్య వయస్సున్న వారిని, ఇంటర్‌‌నెట్‌ ‌ద్వారా 1,08,000మందికి పైగా సర్వే చేశారు. చాలా దేశాలు, ప్రాంతాల్లో ఇద్దరు పిల్లలు కలిగిన కుటుంబానికే మొగ్గు చూపడంతో దాన్ని ఆదర్శవంతమైన కుటుంబ పరిమాణం గా ఎంపిక చేశారు. అదే పశ్చిమ, సెంట్రల్‌ ఆఫ్రి కా, తూర్పు, దక్షిణాఫ్రికాల్లో అయితే పెద్ద పెద్ద కుటుంబాలు సర్వ సాధారణంగా వున్నాయి. అధికంగా 88శాతం మంది ఆర్థికంగా అంతా బాగుంటేనే కుటుంబ జీవితానికి ఓటు వేశారు.

సుస్థిర ఉపాధి వుంటే చాలన్నవారు 87శాతం మంది వున్నారు. భావోద్వేగాల పరంగా సిద్ధంగా వున్నవారు 85 శాతం మంది వున్నారు. సగటున, పురుషు లతో పోలిస్తే మహిళలు ప్రతి ముందస్తు షరతు లకు రేటింగ్‌ ఎక్కువగా ఇచ్చారని నివేదిక పేర్కొంది. పిల్లలతో వచ్చే సంతోషం, ఆనందం అన్న కారణానికి అధిక రేటింగ్‌ లభించింది. 80శాతం మంది యువత ఇందుకు ప్రాధాన్యత ఇచ్చారు. కాగా పిల్లలను కంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, లేదా భవిష్యత్తులో శ్రామిక శక్తిగా పనికివస్తారనే కారణాలకు చాలా తక్కువ మద్దతు లభించిందని నివేదిక వివరించింది. పిల్లలు వుండాలంటే ఆర్థికంగా, ఇళ్ళకు సంబంధించిన ఇబ్బందులను ప్రధాన కారణంగా చూపారు. దాదాపు 72శాతం మంది దీనికే ఓటు వేశారు. సరైన భాగస్వామి దొరకపోవడం, ఆరోగ్యం, పునరుత్పాదకత వంటి కారణాలు తర్వాతి స్థానాలో్ల వున్నాయని నివేదిక పేర్కొంది. ఆర్థికపరంగా అంతా బాగుంటే సరైన భాగస్వామిని చూసు కుని, పెళ్ళి చేసుకుని, పిల్లలను కనడానికి యువత సుముఖంగా వున్నారనే విషయం కొట్టొచ్చినట్లు కనిపించిందని యుఎన్‌ఎఫ్‌‌పిఎ ఎగ్జిక్యూటివ్‌ ‌డైరెక్టర్‌ ‌డియనె కైతా చెప్పారు. యువతరం పెళ్ళిని తిరస్కరిస్తున్నారని, కుటుంబ జీవితాన్ని కోరుకోవడం లేదనే సమాచారం బాగా వ్యాప్తిలో వుందని, కానీ అదంతా అవాస్తవమని ఈ సర్వేతో వెల్లడైందని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -