వీడియోను తొలగించిన కేంద్రం
పోలీసుల కాళ్లు పట్టుకున్న
అభిజీత్ దీప్కే
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు సంబంధించిన వీడియోను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. జంతర్ మంతర్ వద్ద టెంట్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలని అభిజీత్ దీప్కే పోలీసులను కోరుతున్న వీడియోను తొలగించారు. టెంట్ ఏర్పాటుకు అనుమతించాలన్న సీజేపీ అభ్యర్థనను పోలీసులు అంగీకరించలేదు. దీంతో దీప్కే కాళ్లు పట్టుకుని జంతర్ మంతర్ వద్ద ఉన్న పోలీసులను అనుమతి ఇవ్వాలని వేడుకున్న వీడియోను తొలగించారు. స్థానిక ఆంక్షల కారణంగా వీడియోను తొలగిస్తున్నట్టు ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ క్రాకోచ్ పార్టీ చేపట్టిన ఆందోళన శుక్రవారం నాటికి 21 రోజులు పూర్తి చేసుకుంది. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 13 రోజులకు చేరుకుంది.


