Saturday, July 11, 2026
E-PAPER

ఇదేం భాష?

- Advertisement -

ట్రంప్ వ్యాఖ్యలపై అరాగ్చీ ఆగ్రహం
టెహ్రాన్
: ఇరాన్ నాయకులు ‘నీచులు. హింసకు పాల్పడుతుంటారు’ అంటూ నోరు పారేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ధీటుగా బదులిచ్చారు. ‘నాగరిక, ధైర్య సాహసాలు కలిగిన దేశమైన ఇరాన్‌ను కించపరచే భాషలో దూషించినంత మాత్రాన దాని గొప్పతనాన్ని తగ్గించలేరు’ అని చురక వేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఇరానీయులు నాగరికత, సంస్కృతి, బలమైన నైతిక విలువలకు ప్రసిద్ధి చెందిన వారు. మేము వారి అసభ్య పదజాలానికి అలాంటి భాషలో సమాధానం ఇవ్వం. చర్యలతోనే బదులిస్తాం. నిర్భయంగా… గొప్ప ధైర్యంతో…’ అని తెలిపారు. అరాగ్చీ తన పోస్టులో ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల పైనే స్పందించారని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రెస్ టీవీ తెలియజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -