Saturday, July 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎయిడ్స్ కార్యక్రమాలకు నిధుల కోత

ఎయిడ్స్ కార్యక్రమాలకు నిధుల కోత

- Advertisement -

ఆరోగ్య భద్రతకు ముప్పు
అమెరికా నిర్ణయంతో లక్షలాది రోగుల భవిష్యత్తు అగమ్యగోచరం

వాషింగ్టన్ : అమెరికా నిధులతో ప్రపంచంలోని వివిధ దేశాలలో అమలవుతున్న అనేక కార్యక్రమాలకు ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోంది. లక్షలాది మంది హెచ్‌ఐవీ రోగుల భవిష్యత్ అనిశ్చితలో పడిపోయింది. ముఖ్యంగా ఆఫ్రికాలో అనేక మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులు అమెరికా అందిస్తున్న సాయంతో జీవితాలు నెట్టుకొస్తున్నారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ద్వారా చేపట్టిన హెచఐవీ కార్యక్రమాల కోసం కేటాయించిన 120 నిధులకు సంబంధించిన గడువు సెప్టెంబరుతో ముగుస్తుంది. ఈ కార్యక్రమాల ద్వారా వివిధ దేశాలలోని 87 లక్షల మందికి పైగా రోగులు సేవలు పొందుతున్నారు. సెప్టెంబరులో నిధుల విడుదల నిలిచిపోతుండడంతో అక్టోబర్ నుంచి వారి బాగోగుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలపై మరింత నియంత్రణ కోసం సీడీసీ కార్యక్రమా లను అమెరికా విదేశాంగ శాఖ ప్రక్షాళన చేయబోతోంది.

ప్రత్యామ్నాయం చూపకుండానే…
2003లో బుష్ ప్రభుత్వం హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ కోసం ‘ప్రసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్‌’ పేరిట ఓ కార్యక్ర మాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రధానంగా ఆఫ్రికాలోని 2.6 కోట్ల మంది ప్రాణాలను కాపాడింది. లక్షలాది ఇన్‌ఫెక్షన్లను నివారిం చింది. కార్యక్రమానికి మరింత ఊతమిచ్చేందుకు చర్యలు చేపట్టామని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దాని ప్రభావం తగ్గిపోతుందని, ఆరోగ్య నిపుణులకు ప్రాధాన్యత లేకుండా పోతుందని విమర్శలు వస్తున్నాయి. సీడీసీకి అమెరికా నిధులతో అందే 120 అవార్డులు కొన్ని వారాలలోనే ఆగిపోతాయని, ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయలేదని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘దీని ఫలితంగా రెండో ప్రపంచ ఆరోగ్య సంక్షోభం తలెత్తవచ్చు. రోగులు, క్లినిక్‌లు, ఆరోగ్య కార్య కర్తలు, ప్రయోగశాలలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏ నిర్వహణ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నాయో ఆ వ్యవస్థలు కనుమరుగు అవుతాయని విశ్లేషకులు తెలిపారు. నిధుల కోత ప్రభావం మొజాంబిక్, టాంజానియా, దక్షిణాఫ్రికాపై అధికంగా ఉంటుందని చెబుతున్నారు.

ప్రాధాన్యత కోల్పోనున్న ఆరోగ్య సంస్థ
నిధుల కార్యక్రమాన్ని పునరుద్ధరించక పోవడం మాట అటుంచి ఓపెన్ ఫండింగ్ అవకాశాలను కూడా రద్దు చేయబోతున్నారు. ట్రంప్ ప్రభుత్వ వ్యూహంలో భాగంగా భాగ స్వామ్య దేశాలు తమకు కావాల్సిన సీడీసీ సేవల కోసం విడివిడిగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆరోగ్యసంస్థ పాత్ర నామమాత్రం అవు తుంది. అది చివరికి ఓ కాంట్రాక్టరుగా మారు తుంది. ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థలు, ప్రయోగ శాలల పనులు, సిబ్బందికి శిక్షణ కోసం ఇక నిధులు సమకూర్చలేమని విదేశాంగ శాఖ అధికా రులు స్పష్టం చేశారు. మందుల సరఫరాల వంటి కొన్ని కార్యక్రమాలను ఒకటి రెండు సంవత్స రాలు మాత్రమే కొనసాగిస్తామని, ఆ తర్వాత అవి కూడా నిలిచిపోతాయని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య భద్రత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరించారు. సమర్ధవంతమైన ప్రత్యామ్నాయం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -