Saturday, July 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెండ్లి విందులో మటన్ పెట్టలేదని రచ్చ రచ్చ

పెండ్లి విందులో మటన్ పెట్టలేదని రచ్చ రచ్చ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బిహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ పెండ్లి వేడుకలో విందు మెనూ వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పెండ్లికి వచ్చిన బంధువులకు మటన్ వడ్డిస్తామని ముందుగా చెప్పి, చివరికి చికెన్ వడ్డించడంతో వరుడి తరఫున బంధువుల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మొదట వాగ్వాదం జరగింది. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలు కర్రలు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -