Saturday, July 11, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చిరుత పులి దాడిలో ఆవు మృత్యువాత 

చిరుత పులి దాడిలో ఆవు మృత్యువాత 

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని డోడర్న నంబర్-3 గ్రామ రైతు జాదవ్ ఉత్తంకు చెందిన ఆవులను పశువుల కాపర్లు రోజూ మాదిరిగానే శనివారం మేతకు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆవులు మేత మేస్తుండగా చెట్ల దాపునుంచి ఒక్కసారిగా చిరుత పులి పశువుల మందపై దాడి చేసింది. ఈ ఘటనను కళ్లారా చూసిన పశువుల కాపర్లు చిరుతను చూసి భయంతో ఊర్లోకి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రైతు జాదవ్ ఉత్తం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫారెస్ట్ ఆఫీసర్ రాజేష్, పశు వైద్యాధికారి గణేష్ లు ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవుమెడపై తీవ్రంగా దాడిచేసి ఆనవాళ్లను బట్టి ఇది చిరుత పులి దాడే అని ప్రాథమికంగా అధికారులు ధృవీకరించారు. ఆర్థికంగా నష్టపోయిన బాదిత రైతు జాదవ్ ఉత్తంకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని అధికారులు భరోసానిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శంకర్ అటవీ శాఖ శాఖ బీట్ అధికారి లక్ష్మణ్, రాజేష్ అవినాష్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -