Saturday, July 11, 2026
E-PAPER
Homeఖమ్మంఛలో ఐటీడీఏను విజయవంతం చేయండి

ఛలో ఐటీడీఏను విజయవంతం చేయండి

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఛలో ఐటీడీఏ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య శనివారం పోడు సాగుదారులకు పిలుపునిచ్చారు. పోడు సాగు చేస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పట్టాలు మంజూరు చేయాలని, ఇప్పటికే హక్కు పత్రాలు పొందిన సాగుదారులకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని వెంటనే వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.గిరిజనుల భూమి హక్కులు, జీవనోపాధి పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పోడు సాగుదారులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై తమ హక్కుల సాధనకు ఐక్యంగా నిలవాలని పుల్లయ్య పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -