Saturday, July 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్తుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న పాలకమండలి.?

భక్తుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న పాలకమండలి.?

- Advertisement -

దేవుని సొమ్ముతో  కమిటీ సభ్యులు యాత్రలు 
నవతెలంగాణ-అచ్చంపేట

మండల పరిధిలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన ఉమామహేశ్వర దేవస్థానం పాలకవర్గం కమిటీ సభ్యులు శ్రీశైలం గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం ద్వారా భక్తులు విరాళాల రూపంలో ఇచ్చిన సొమ్మును భక్తి పేరుతో విలాసంగా ఖర్చు చేస్తున్నారని అచ్చంపేటలో కొందరు భక్తులు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా యాత్ర పేరుతో ఈసారి ఈ పాలకవర్గం కమిటీ  ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల భక్తులు విమర్శలు చేస్తున్నారు. గిరి ప్రదక్షణ పేరుతో శ్రీశైలం, త్రిపురాంతకం, జ్యోతి సిద్ధపటం, అలంపూర్ పుణ్యక్షేత్రాలను మూడు రోజులు పాలక వర్గ కమిటీ బృందం సందర్శించుకుంటుంది. ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి (ఈ ఓ ) శ్రీనివాసరావులు  భక్తి పేరుతో యాత్ర నిర్వహిస్తూ ఆలయ సొమ్మును వృధా ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారులు యాత్ర పై పూర్తి విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే..గుడికి సంబంధించిన నిధులు లెక్క తేలడం లేదని తెలుస్తుంది. భోగ మహేశ్వరం నుండి కొండపైకి బస్సు సౌకర్యం కల్పించి భక్తుల నుంచి టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని భక్తులు మండిపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -