సెమీస్‌కు చేరిన మాజీ చాంపియన్
2-1తో క్వార్టర్స్‌లో బెల్జియంపై గెలుపు
ఫిఫా 2026 ప్రపంచకప్
లాస్ ఏంజెలెస్ (యుఎస్‌ఏ) : ఫిఫా 2026 ప్రపంచకప్‌లో స్పెయిన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ ఫేవరేట్‌గా ప్రపంచకప్‌కు వచ్చిన స్పెయిన్ ఒక్క గోల్ కూడా ప్రత్యర్థులకు ఇవ్వకుండా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. తాజాగా శనివారం లాస్‌ఏంజెలెస్ స్టేడియంలో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో బెల్జియంపై 2-1తో ఘన విజయం సాధించింది. అగ్రజట్టు స్పెయిన్‌కు ఆఖరు వరకు గట్టి పోటీ ఇచ్చిన బెల్జియం.. ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించింది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో 2024 ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్‌తో స్పెయిన్ తలపడనుంది.
మెరినో మెరుపుల్
క్వార్టర్‌ఫైనల్లో బెల్జియం నుంచి స్పెయిన్‌కు గట్టి పోటీ ఎదురైంది. బంతి నియంత్రణ, గోల్ పోస్ట్‌పై దాడులతో స్పెయిన్ దూకుడుగా ఆడింది. కానీ బెల్జియం మెరుగైన డిఫెన్స్‌ను స్పెయిన్‌ను నిలువరించింది. 30వ నిమిషంలో ఫాబియన్ రూయిజ్ గోల్‌తో స్పెయిన్ 1-0తో ముందంజ వేసింది. కానీ ప్రథమార్థంలోనే బెల్జియం లెక్క సరి చేసింది. చార్లెస్ డి కెటెలెరె గోల్ 41వ నిమిషంలో గోల్ కొట్టాడు. దీంతో ప్రథమార్థం 1-1తో ముగిసింది.
మరో గోల్ కోసం స్పెయిన్ దూకుడు పెంచినా ద్వితీయార్థం ఆరంభంలో ఫలితం దక్కలేదు. కానీ బెల్జియం గోల్ కీపర్ కోర్టియస్ గాయంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో సెనె లామెన్స్ గోల్ కీపర్‌గా వచ్చాడు. ఈ అవకాశాన్ని స్పెయిన్ సద్వినియోగం చేసుకుంది. డిఫెండర్ పా కుబార్సి కొట్టిన షాట్‌ను లామెన్స్ సరిగా పట్టుకోలేకపోయాడు. దీంతో అక్కడే ఎదురుచూస్తున్న మైకల్ మెరినో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. 85వ నిమిషంలో గ్రౌండ్‌లోకి సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మెరినో మ్యాజిక్ గోల్‌తో స్పెయిన్‌ను 2-1తో ముందంజలో నిలిపాడు. మరో రెండు నిమిషాల్లో ఆట అదనపు సమయంలోకి వెళ్తుండగా.. మెరినో గోల్‌తో బెల్జియంకు భంగపాటు తప్పలేదు. పోర్చుగల్‌తో మ్యాచ్‌లోనూ ఇంజూరీ టైమ్‌లో మెరినో కండ్లుచెదిరే గోల్‌తో స్పెయిన్‌ను విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. 2010లో ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఆ తర్వాత వరుసగా నిరాశపరిచింది. 2014లో గ్రూప్ దశ నుంచి నిష్క్రమించగా, 2018, 2022లో రౌండ్ ఆఫ్ 16లో ఓటమిపాలైంది. 2024లో యూరో కప్ విజేతగా నిలిచిన స్పెయిన్..కోచ్ ఫ్యూయెంటె సారథ్యంలో ప్రపంచ విజేతగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్ తలపడనుంది. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ముఖాముఖి పోటీపడటం ఇది రెండో సారి మాత్రమే. 2006 ప్రీ క్వార్టర్స్‌లో స్పెయిన్‌పై ఫ్రాన్స్ 3-1తో విజయం సాధించింది. స్పెయిన్ ఈసారి లెక్క సరి చేస్తుందేమో చూడాలి.
సూపర్ స్పెయిన్
- Advertisement -
- Advertisement -


