Sunday, July 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆరుగురి హత్య కేసులో కీలక మలుపు..

ఆరుగురి హత్య కేసులో కీలక మలుపు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసి పరారైన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షాబాద్లో బాలిక, బాలిక తల్లి, బాలిక నానమ్మ ముగ్గురిని హత్య చేయడంతో పాటు తన భార్య సరిత ఇద్దరు కుమారులను హత్య చేసి పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ పరారైన సంగతి తెలిసిందే. హత్య చేసిన అనంతరం కారులో బాల్ నగర్ వైపు వెళ్లినట్టు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితుడు రాజ్ కుమార్ ఉపయోగించిన రెడ్ కలర్ షిఫ్ట్ కారును కొత్తూరు సమీపంలోని నందిగామ ఆర్ యు బి సమీపంలో పోలీసులు గుర్తించారు.

కారును నందిగామ ఆర్ యు బి ముందు వదిలేసి పట్టాల పైకి వెళ్లాడంటూ పోలీసులు సమాచారం సేకరించారు. కొత్తూరు, బాల్ నగర్ రైల్వే స్టేషన్లతో పాటు సమీపంలోని అన్ని గ్రామాల్లో నిందితుడు రాజకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజ్ కుమార్ను పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -