Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా శక్తి  సమాజాన్నే మార్చగలదు

మహిళా శక్తి  సమాజాన్నే మార్చగలదు

- Advertisement -

ఘనంగా మహిళా దినోత్సవం
మాజీ ఎంపిటిసి కంది మల్లేష్ కు సన్మానం
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా మహిళ జీవితం నిరంతర పోరాటంగా కొనసాగుతోందని, ఈ పోరాటం ఆమె కత్తులతో, తుపాకులతో చేయడం లేదని. మనసుతో, కుటుంబంతో, సమాజంతో చేస్తుందని మాజీ ఎంపిటిసి ఫోరం చైర్మన్ కంది మల్లేష్ అన్నారు. ఆదివారం నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను మాజీ ఎంపిటిసి ఫోరం చైర్మన్ కంది మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్ర పరిధిలో ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలను, ఐకెపి సిబ్బందిని, గ్రామపంచాయతీ సర్పంచ్ లక్ష్మి,కి  వార్డు సభ్యులకు గ్రామ ప్రముఖ మహిళాలకు శార్వా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాజీ ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ మహిళల పట్ల ఆప్యాయత, ప్రేమతో గత 13 ఏండ్లుగా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం, మహిళలను సన్మానించడం, మహిళలకు భోజనాలు పెట్టే కార్యక్రమం కంది మల్లేష్ కే సాధ్యమని ఆమె తెలిపారు. మండల కేంద్రంలో ఎంతమంది నాయకులు ప్రజాప్రతినిధులు వచ్చారు పోయారు కానీ క్రమం తప్పకుండా మహిళలను దృష్టిలో ఉంచుకొని జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయ విషయమని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాజీ ఎంపిటిసి ఫోరం చైర్మన్ కంది మల్లేష్ మాట్లాడుతూ ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అనేది ఒక ప్రసిద్ధ సామెత, ఇది పురుషుడి విజయానికి మహిళ అందించే నిరంతర మద్దతు, త్యాగం మరియు ప్రోత్సాహాన్ని గుర్తిస్తుంని. ఇది తల్లిగా, భార్యగా, సోదరిగా లేదా స్నేహితురాలిగా మహిళ చూపే ప్రేమ, ఓర్పు మరియు బలాన్ని సూచిస్తుందన్నారు. నేటి కాలంలో మహిళలు స్వయంగా విజయం సాధిస్తూ, మగవారికి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. పొద్దున లేవడంతో మొదలయ్యే వంటపనితోనే ఆమె పోరాటం మొదలవుతుందని. యుద్ధంలో తుపాకీ చేపట్టిన సైనికుడు ముందుకు సాగిపోయినంత వేగంగా కుటుంబాన్ని సాకడం కోసం ఆమె దూసుకుపోతుందన్నారు.

అందరి కష్టం తన కష్టంగా భావిస్తుందని అందుకే ప్రతి సంవత్సరం 30 నుంచి 50 మంది మహిళా తల్లులను సన్మానించి వారి ఆశీస్సులు పొందుతున్నానన్నారు. మహిళల అభివృద్ధి కోసం తన వంతు ఎప్పుడు కృషి చేస్తానని ఆయన అన్నారు. మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మాజీ ఎంపిటిసి ఫోరం చైర్మన్ కంది మల్లేష్ కు మండల పరిధి ప్రజా ప్రతినిధులు, మహిళా అధికారినిలు  శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి శంకర్ నాయక్, నాయకులు ఖలీల్, ఫయాజ్, మైశాగౌడ్, లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -