Sunday, July 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా సెనెటర్‌..ట్రంప్‌ సన్నిహితుడు లిండ్సే గ్రాహం కన్నుమూత

అమెరికా సెనెటర్‌..ట్రంప్‌ సన్నిహితుడు లిండ్సే గ్రాహం కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా సెనెటర్, ట్రంప్‌ సన్నిహితుడు లిండ్సే గ్రాహం (71) కన్నుమూశారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుంటుండగా శనివారం సాయంత్రం స్వగృహంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అయితే ఆయన అనారోగ్యానికి కారణాలు వెల్లడించలేదు. 2003 నుంచి యూఎస్ సెనేట్‌లో సౌత్ కరోలినాకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాతీయ భద్రత, విదేశాంగ విధాన చర్చలు వంటి వాటిలో చురుకుగా వ్యవహరిస్తూ.. దేశంలోని కీలక నేతల్లో ఒకరిగా పేరు పొందారు. అమెరికాకు చెందిన అనేక కీలక అంశాలలో ట్రంప్‌కు బలమైన మద్దతుదారుగా వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -