Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ -పరకాల : పరకాల నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హనుమకొండ భవాని నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 45 మంది లబ్ధిదారులకు రూ. 20 లక్షల 91,900 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఇది పూర్తిగా ప్రజా ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెండింగ్‌లో పడిన చెక్కులను ఇప్పుడు సకాలంలో లబ్ధిదారులకు అందిస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం, అదే కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ఓటర్లు దరఖాస్తులు చేసుకునేలా సహకరించాలని, పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -