శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్న చిత్రం ‘చోర శికామణులు’. ఆనంద్ కుర్మా ఈ మూవీకి కథ, కథనం, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, క్రైమ్, కామెడీ జోనర్‌లో రానున్న ఈ మూవీలో రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆనంద్ రాజావిక్రమ్ సంగీత దర్శకుడిగా, జగదీష్ కొమరి కెమెరామెన్‌గా, యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలను డ్రాగన్ ప్రకాష్ నిర్వహించనున్నారు.
ఈనెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
‘చోర శికామణులు’ మొదలైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



