నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు మర్డర్ల కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఓ వెంచర్ వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ గ్రామం అతని మేనమామ స్వగ్రామంగా తెలుస్తోంది. రాజ్‌కుమార్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, మృతదేహం సమీపంలో విషం బాటిల్ కనిపించినట్లు సమాచారం. రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
షాబాద్ ఆరు మర్డర్ల కేసు నిందితుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


