Monday, July 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశేఖర్ మాస్టర్‌తో గొడవ..స్పందించిన జానీ మాస్టర్

శేఖర్ మాస్టర్‌తో గొడవ..స్పందించిన జానీ మాస్టర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలకు జానీ మాస్టర్ తెరదించారు. సినిమా డాన్సర్ల అసోసియేషన్ సమావేశంలో తమ యూనియన్‌కు సంబంధించిన అంతర్గత సమస్యలపై చర్చలు జరిగాయని, దీనికి శేఖర్ మాస్టర్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తామంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటామని, యూనియన్ సంక్షేమం కోసం అందరం కృషి చేస్తామని జానీ మాస్టర్ తెలిపారు. వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -