Tuesday, July 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలువియత్నాం బోటు ప్రమాదం..హైదరాబాద్‌ చేరుకున్న మృతదేహాలు

వియత్నాం బోటు ప్రమాదం..హైదరాబాద్‌ చేరుకున్న మృతదేహాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: వియత్నాం బోటు ప్రమాద బాధితుల మృతదేహాలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లను ఏపీఎన్‌ఆర్‌టీఐ సిద్ధం చేసింది. వియత్నాం, భారత ఎంబసీలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాట్లాడి మృతదేహాల తరలింపు వేగవంతం చేశారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, కడపకు చెందిన శ్రీధర్, హిందూపురానికి చెందిన రవితేజ ఉన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో వియ‌త్నాం మృతుల కుటుంబ స‌భ్యుల‌ను మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ ప‌రామ‌ర్శిoచారు. మృత‌దేహాల‌ను కుటుంబస‌భ్యుల‌కు అప్పగించి ఆంబులెన్స్‌లో స్వగ్రామాల‌కు పంపే ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -