- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించే స్పెషల్ టెట్-2026 నోటిఫికేషన్‌ను జూలై 21న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇకపై ప్రతి ఏడాది రెండు స్పెషల్ టెట్‌లు, రెండు సాధారణ టెట్‌లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2011కు ముందు ఉద్యోగాల్లో చేరి ఐదేళ్లకు పైగా సేవ పూర్తి చేసిన ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సి ఉండటంతో ఈ ప్రత్యేక పరీక్షలను నిర్వహిస్తున్నారు.
- Advertisement -


