నవతెలంగాణ-హైదరాబాద్ : హార్మోజ్ జలసంధిలో పెరుగుతున్న దాడులు, పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని దిగ్బంధిస్తున్నామని, అక్కడ టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేయడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ పరిణామాలు భారతీయ మార్కెట్లను తీవ్ర ప్రతికూలతల్లోకి నెట్టడంతో మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుండే సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
ఈ అంతర్జాతీయ భయాందోళనల నేపథ్యంలో.. మంగళవారం ఉదయం మార్కెట్ల ప్రారంభ సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 412 పాయింట్లు కుప్పకూలి 77,203 వద్ద ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 107 పాయింట్లు నష్టపోయి 24,103 వద్ద కదలాడుతోంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశీయ రంగాలైన పెయింట్స్, ఏవియేషన్, టైర్స్ మరియు ఆటోమొబైల్ రంగానికి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- Advertisement -
- Advertisement -



