- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు, కొత్త రహదారి ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి త్వరితగతిన ఆమోదం, నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం.
- Advertisement -



