Tuesday, March 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్ర గవర్నర్‌గా శివ్‌ ప్రతాప్‌ శుక్లా రేపు ప్రమాణం

రాష్ట్ర గవర్నర్‌గా శివ్‌ ప్రతాప్‌ శుక్లా రేపు ప్రమాణం

- Advertisement -

హాజరు కానున్న సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర గవర్నర్‌గా శివ్‌ ప్రతాప్‌ శుక్లా రేపు భాద్యతలు చేపట్టనున్నారు. హైకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ఆయనచే ప్రమాణం చేయించనున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని లోక్‌ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నా రు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న
శుక్లాను తెలంగాణ నూతన గవర్నర్‌గా, తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణు దేవ్‌ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆయన ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

5వ గవర్నర్‌గా శుక్లా
శివ్‌ ప్రతాప్‌ శుక్లా రాష్ట్రానికి 5వ గవర్నర్‌ కాగా అంతకు ముందు నలుగురు గవర్నర్లు బాద్యతలు నిర్వహించారు. 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్‌. నర్సింహన్‌ సుదీర్ఘ కాలం పని చేశారు. ఆయన ఏకంగా 5 సంవత్సరాల 97 రోజులు, ఆ తర్వాత తమిళిసై సౌందర్‌రాజన్‌ 4 సంవత్సరాల 193 రోజులు పని చేశారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి, అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ.రాధాకృష్ణన్‌ తాత్కాలిక గవర్నర్‌గా 132 రోజులు, ప్రస్తుతం బదిలీపై మహారాష్ట్రకు వెళుతున్న జిష్ణుదేవ్‌ వర్మ ఏడాది 221 రోజులు పని చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -