నవతెలంగాణ-హైదరాబాద్ బద్రీనాథ్ ఆలయ విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తు బృందం(సిట్) స్పీడు పెంచింది. గర్వాల్ నేతృత్వంలో సిట్ ఆలయ సీఈవో ను ప్రశ్నిస్తోంది. ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సోహన్ సింగ్ రంగద్ తోపాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు అతుల్ దిమ్రిలపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అదే విధంగా సిట్ అధికారులు ఆలయంలోని సీసీటీవీ కంట్రోల్ రూమ్‌లో తనిఖీలు చేపట్టారు. ఆలయంలో రోజువారీ విరాళాల లెక్కింపు ఎలా నిర్వహిస్తున్నారో గమనించారు.
సస్పెండ్ అయిన బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) ఉద్యోగి ప్రమోద్ నౌటియాల్‌కు గోపేశ్వర్‌లోని జిల్లా సెషన్స్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించి, పుర్సాది జిల్లా జైలుకు పంపింది. అయితే జూన్ 25 నాటి సీసీటీవీ ఫుటేజీని సమీక్షిస్తున్నప్పుడు, కరెన్సీ లెక్కింపు గదిలో పలువురు ఇతర బీకేటీసీ ఉద్యోగులు అత్యంత అనుమానాస్పదంగా ప్రవర్తించడాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు.



