Wednesday, July 15, 2026
E-PAPER
Homeఆటలుఅర్జెంటీనా అడుగు పడేనా?

అర్జెంటీనా అడుగు పడేనా?

- Advertisement -

ఇంగ్లాండ్‌తో నేడు సెమీఫైనల్‌ పోరు
ఫిఫా 2026 ప్రపంచకప్‌
అర్థరాత్రి 12.30 నుంచి జీ నెట్‌వర్క్‌లో..

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ప్రపంచమే ఊగిపోతుండగా.. టైటిల్‌ రేసు రసవత్తర దశకు చేరుకుంది. ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ఫిఫా ర్యాంకింగ్స్‌లో టాప్‌-4 జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఫ్రాన్స్‌, అర్జెంటీనా, స్పెయిన్‌, ఇంగ్లాండ్‌లు సెమీఫైనల్‌కు చేరుకోగా.. నేడు అర్థరాత్రి అట్లాంటాలో అర్జెంటీనాతో ఇంగ్లాండ్‌ తలపడనుంది. టైటిల్‌ నిలబెట్టుకున్న మూడో జట్టుగా నిలిచేందుకు డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా తహతహలాడుతుండగా, 60 ఏండ్ల నిరీక్షణకు తెరదించేందుకు ఇంగ్లాండ్ ఎదురుచూస్తోంది.

అట్లాంటా (యుఎస్‌ఏ)

ఫిఫా ప్రపంచకప్‌ రసవత్తర ముగింపునకు చేరుకుంది. తొలిసారి ఫిఫా ర్యాంకింగ్స్‌లో టాప్‌-4 జట్టు సెమీస్‌కు చేరుకోగా.. 2022 ప్రపంచకప్ ఫైనలిస్ట్‌లు అర్జెంటీనా, ఫ్రాన్స్‌ సైతం సెమీస్‌కు చేరాయి. ఓ సెమీస్‌లో ఫ్రాన్స్‌, స్పెయిన్‌ తలపడనుండగా, నేడు అర్థరాత్రి 12.30కి జరిగే రెండో సెమీస్‌లో అర్జెంటీనాతో ఇంగ్లాండ్‌ ఢీకొట్టనుంది. అర్జెంటీనా, ఇంగ్లాండ్‌ సుదీర్ఘ విరామం అనంతరం ముఖాముఖి తలపడనుండగా.. లియోనల్‌ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి త్రీ లయన్స్‌తో ఢీకొట్టనున్నాడు. లియోనల్‌ మెస్సీ మేనియా, టీమ్‌ స్పిరిట్‌తో అర్జెంటీనా దీమాగా ఉండగా… హ్యారీ కేన్‌, బెలింగ్‌హామ్‌ మెరుపులపై ఇంగ్లాండ్‌ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

మెస్సీ మాయ చేసేనా?
ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. నాకౌట్‌లో కాస్త చెమటోడ్చినా.. లియోనల్‌ మెస్సీ మేనియాతో ముందంజ వేసింది. ప్రత్యర్థులు లియోనల్‌ మెస్సీ కోసం పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్నారు. దీంతో మెస్సీ ఎక్కువగా గోల్‌ అవకాశాలు సృష్టించేందుకు మొగ్గు చూపిస్తున్నాడు. ఎంజో ఫెర్నాండేజ్‌, మార్టినెజ్‌, అలెక్సిస్‌ మాక్స్‌ అలిస్టర్‌లు మెస్సీ తోడుగా గోల్స్‌ కొట్టే బాధ్యత తీసుకుంటున్నారు. బంతిని నియంత్రణలో నిలుపుకోవటంతో పాటు నిలకడగా ఎదురుదాడి చేయటంపైనే అర్జెంటీనా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఆ ఇద్దరే కీలకం
ఇంగ్లాండ్‌ 60 ఏండ్లుగా ఫిఫా ప్రపంచకప్‌ టైటిల్‌ కోసం నిరీక్షిస్తోంది. ఇప్పడు త్రీ లయన్స్‌కు ఇద్దరు సూపర్‌స్టార్స్‌ ఉన్నారు. ఫార్వర్డ్‌లో హ్యారీ కేన్‌ గోల్స్‌ కొట్టేందుకు ఎదురుచూస్తుండగా.. మిడ్‌ఫీల్డ్‌ నుంచి బెలింగ్‌హామ్‌ దూసుకొస్తున్నాడు. ఈ ఇద్దరు మెరిస్తే అర్జెంటీనాకు కష్టాలు తప్పవు. క్వార్టర్‌ఫైనల్లో హాలాండ్‌ మెరుపులను అడ్డుకుని నార్వేపై గెలుపొందిన ఇంగ్లాండ్‌ నేడు సెమీఫైనల్లోనూ అదే జోరు చూపించాలని చూస్తోంది.

ఎన్నాండ్లో వేచిన పోరు
ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఇంగ్లాండ్‌ మధ్య పోటీ అత్యంత ఉత్కంఠభరిత సమరాల్లో ఒకటి. 1966 ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్‌, 1986లో డీగో మారడోనా ‘హ్యాండ్ ఆఫ్‌ గాడ్‌’, 1998లో డెవిడ్‌ బెక్‌హామ్‌కు రెడ్‌ కార్డ్‌ మ్యాచ్‌లు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఉర్రూతలూగించాయి. చివరగా ఈ రెండు జట్లు 2005లో తలపడగా.. అప్పటికి లియోనల్‌ మెస్సీ అంతర్జాతీయ అరంగ్రేటం చేయలేదు. లియోనల్‌ మెస్సీ అర్జెంటీనా తరఫున తొలిసారి ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనున్నాడు. ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఇంగ్లాండ్‌ ఐదుసార్లు తలపడగా.. మూడుసార్లు త్రీ లయన్స్‌ గెలుపొందగా, రెండు సార్లు అర్జెంటీనా విజయం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -