Thursday, July 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురమణమూర్తిపై భౌతికదాడిని ఖండిస్తున్నాం

రమణమూర్తిపై భౌతికదాడిని ఖండిస్తున్నాం

- Advertisement -

కశ్యప్‌‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌టీవీ
చర్చా వేదికలో జైభారత్‌ ‌నాయకులు రమణమూర్తిపై మతోన్మాది కశ్యప్ రెడ్డి చెప్పుతో భౌతిక దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన అభిప్రాయాన్ని చెప్పిన రమణమూర్తిపై విచక్షణారహిత దాడికి తెగబడటం దారుణమని విమర్శించారు. భిన్నాభి ప్రాయాలను గౌరవించాల్సింది పోయి ఇలాంటి అనాగరిక పద్ధతుల్లో అవమానకర వ్యాఖ్యానాలు చేస్తూ దాడులు చేయడం భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఈ ఘటనకు పాల్పడిన కశ్యప్ రెడ్డిపై చట్టపరంగా తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలనీ, కఠినంగా శిక్షించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికీ, డీజీపీకీ విన్నవించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కశ్యపరెడ్డిపై చర్యలు తీసుకోవాలి : ఐద్వా డిమాండ్‌జయభారత్ జాతీయ అధ్యక్షులు, విజయ విహారం రమణమూర్తి పై మంగళవారం టివి లైవ్ చర్చా వేదికలో ధర్మవీర్ నాయకుడు కశ్యపరెడ్డి చెప్పుతో దాడి చేయడాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వా ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు . పరిపాలనలో రాజకీయాలకు మతాన్ని వాడుకోకూడదని అభిప్రాయపడ్డారు. చర్చలో పాల్గొనడానికి బదులుగా ఏకంగా లైవ్ షోలో ప్రజలు చూస్తున్నారన్న విచక్షణ కోల్పోయి అత్యంత దారుణంగా చెప్పుతో కశ్యపరెడ్డి కొట్టడం సరికాదన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మన రాజ్యాంగం వాక్‌ ‌స్వాతంత్రాన్ని కల్పించిందని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని మాటల ద్వారా చర్చించుకోవాలే తప్ప ఒక వ్యక్తిని గాయపరిచే హక్కు ఎవరికి లేదన్నారు.దాడి అమానుషం : 
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
టి స్కైలాబ్ బాబు జైభారత్, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ మరియు ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవిహారం రమణమూర్తిపై దాడి చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాది కశ్యప్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌‌కే టీవీ చర్చా కార్యక్రమంలో శ్రీకృష్ణ భగవానుడి తల స్థానంలో మోడీ తల పెట్టడం అమానుషం, హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దంటూ ఫొటో చూపిస్తూ ఆయన మాట్లాడటమే నేరమా? అని ప్రశ్నించారు. ఆయనపై చెప్పుతో దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ వారికి దేవుడి కంటే మోడీ ఎక్కువయ్యాడా? దేవుడిని ఎందుకు అవమానించారు? ఇది తప్పని మాట్లాడినందుకు ఆయనపై దాడి చేస్తారా? అని నిలదీశారు. సమాజంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, హిందూ, ముస్లింల మత సామరస్యానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఆయన్ను సైద్ధాంతికంగా ఎదుర్కొలేకనే కుట్రపూరితంగా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని విమర్శించారు. ప్రశ్నించిన ప్రతి వ్యక్తిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి దాడులను సహించబోమని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -