టెహ్రాన్ : తమ అణు కేంద్రాలలో అంతర్జాతీయ తనిఖీల పునఃప్రారంభానికి తాము అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థ అయిన అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఐఏఈఏ) తనిఖీదారులను అణు కేంద్రాల్లోకి తిరిగి ప్రవేశించడానికి టెహ్రాన్ అనుమతిస్తుందా అనే ప్రశ్నలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ సమాధానమిస్తూ ఆ అభ్యర్థనను ఇరాన్ అంగీకరించబోదని చెప్పారు. టెహ్రాన్ అణు కార్యక్రమం భవిష్యత్తుపై చర్చలు జరపాలని పిలుపునిచ్చే ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కింద టెహ్రాన్ , వాషింగ్టన్ మధ్య చర్చలు కొనసాగుతుండగా ఈ వైఖరి వెలువడింది. అయితే, ఈ ఒప్పందం ఏ పక్షాన్నీ నిర్దిష్ట చర్యలకు లేదా కాలపరిమితులకు కట్టుబడి ఉండేలా చేయదు. అవగాహనా ఒప్పందం పై సంతకం చేసిన తర్వాత అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య రెండ్రోజుల ప్రత్యక్ష చర్చల అనంతరం, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కొద్ది రోజుల్లోనే ఐఏఈఏ తనిఖీలు పునఃప్రారంభమ వుతాయని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా ఆ అంచనాను ఇరాన్ అధికారులు ఆ తర్వాత సవాలు చేశారు. తనిఖీలకు సంబంధించిన ఏ ఏర్పాటైనా వాషింగ్టన్‌తో కుదిరే ఒక విస్తృత ఒప్పందంలో భాగంగా మాత్రమే ఖరారు చేయబడుతుందని ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ సంధానకర్త అన్నారు.
ఒబామా పరిపాలన కాలంలో చర్చలు జరిపి, అధికారికంగా జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ( జేసీపీఓఏ)గా పిలువబడే 2015 అణు ఒప్పందం కింద, ఐఏఈఏ గతంలో ఇరాన్ అణు కర్మాగారాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసింది. పర్యవేక్షణ కెమెరాలను నిర్వహించింది. అయితే, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఈ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకున్న తర్వాత ఇరాన్ క్రమంగా ప్రవేశాన్ని పరిమితం చేసింది. అప్పటి నుంచి టెహ్రాన్ తన యురేనియం సుసంపన్నం చేసే కార్యకలాపాలను గణనీయంగా విస్తరించింది, మొదటిసారిగా దాదాపు ఆయుధ-స్థాయి పదార్థాన్ని ఉత్పత్తి చేసింది . దాని అణు కార్యక్రమం యొక్క దిశపై పాశ్చాత్య ప్రభుత్వాలలో ఆందోళనలను పెంచింది.
అణుకేంద్రాల్లో తనిఖీలకు అంగీకరించం : ఇరాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



