Wednesday, July 15, 2026
E-PAPER
Homeఆటలుగ్రామీణ క్రికెటర్లకు టీసిఏ భరోసా

గ్రామీణ క్రికెటర్లకు టీసిఏ భరోసా

- Advertisement -

తెలంగాణ క్రికెట్‌ సంఘం
కార్యదర్శి గురువారెడ్డి


నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ గ్రామీణ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేవారికి తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి, అండగా ఉంటుందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ధరమ్‌ గురువారెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో టీసీఏ జట్ల ఎంపిక సందర్భంగా గురువారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. కేవలం హైదరాబాద్‌కే పరిమితమై, జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లన విస్మరిస్తోంది. టీజీ20 లీగ్‌లో జిల్లాల పేరు వాడుకున్నప్పటికీ.. జిల్లాల నుంచి ప్రతిభావంతులైన క్రికెటర్లకు అవకాశాలు కల్పించలేదు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసే బాధ్యత టీసీఏ తీసుకుంటుందని’ గురువారెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -