Tuesday, July 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే సినిమా

ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే సినిమా

- Advertisement -

శ్రీకాంత్, లయ జంటగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందు తున్న సినిమా ‘మిస్టర్ మిడిల్ క్లాస్`. జీకే అండ్ సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు దర్శకులు వివి వినాయక్, దశరథ్, రచయిత, నిర్మాత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ,’రాజేంద్ర ప్రసాద్కి హృదయపూర్వక అభినందనలు. నిజానికి ఇది ఆయన సినిమానే. వెంకటేశ్వర స్వామి పాత్ర లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఒక పెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. మనమందరం కూడా ఏదో ఒక సమయంలో మిడిల్ క్లాస్ నుంచే వచ్చిన వాళ్లమే. ఈరోజు ధనవంతులుగా ఉన్న వాళ్లూ ఒకప్పుడు మిడిల్ క్లాస్ జీవితాన్నే గడిపారు. మిడిల్ క్లాస్ వాళ్లు పడే కష్టాలను వినోదాత్మకంగా చెప్పడం ఒక గొప్ప కళ. ఆ విషయంలో నాగేశ్వర్ రెడ్డి అద్భుతంగా విజయం సాధిం చారు. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడికే చెప్పు కుంటాం. ఇలాంటి ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌లో నటించటం చాలా ఆనందంగా ఉంది` అని అన్నారు.’దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాకి ఫస్ట్ క్లాప్ కొట్టారు. అప్పటి నుంచి మాతో కలిసి ప్రయాణం చేస్తూ ఈ స్థాయికి వచ్చారు. ఆయన ఎదుగుదల చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర చేయాలని నాగేశ్వర్ రెడ్డి చెప్పినప్పుడు నేను చాలా ఆలోచించాను.

ఎన్టీఆర్ పోషించిన పాత్రలన్నీ నాకు గుర్తుకొచ్చాయి. అలాంటి పాత్రలు చేయాలంటే చాలా భయం, భక్తి ఉండాలి. అందుకే ఈ పాత్రను ఎంతో నిష్ఠతో చేశాను. సెట్లో అందరూ ‘చాలా అద్భుతంగా ఉంది’ అని చెప్పిన ప్రతిసారీ నాకు ఎంతో ప్రోత్సాహంగా అనిపించేది. ఇలాంటి గొప్ప పాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిని చాలా ఫ్రెండ్లీగా చూపించాం. ఆ పాత్ర ద్వారా రాజేంద్ర ప్రసాద్ మీ అందరికీ ఒక స్నేహితుడిలా అనిపిస్తాడు` అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.’మా సినిమా చూసి అద్భుతంగా ఉందని చెప్పిన వి.వి. వినాయక్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. శ్రీకాంత్ తో సినిమా చేయడం నాకు ఎప్పుడూ హాయిగా ఉంటుంది. ‘పెళ్లి సందడి, వినోదం, ఎగిరే పావురమా, ఆమె` వంటి శ్రీకాంత్ బ్లాక్‌బస్టర్ సినిమాలను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు రావాలి. రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకు ఆయన వెన్నెముకలా నిలిచారు. కుటుంబంలో ఉన్న ప్రతి భార్య లయ పాత్రను ఎంతో ఇష్టపడుతుంది. ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారు. మా డీవోపీ అంజి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి నాకు అండగా నిలిచారు. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం అందించారు` అని దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -