Thursday, July 16, 2026
E-PAPER
Homeబీజినెస్ఐదేళ్లలో జర్మనీలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది: శ్వేతా గురు, ఆక్సిలో

ఐదేళ్లలో జర్మనీలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది: శ్వేతా గురు, ఆక్సిలో

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారతదేశం నుండి విదేశాలకు వెళ్లే విద్యార్థులలో అత్యధికులను ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియా ఆకర్షిస్తున్నాయి. కానీ ఈ పాత ప్రాధాన్యతా క్రమం ఇప్పుడు సడలుతోంది. పెరుగుతున్న ఖర్చులు, కఠినతరం అవుతున్న వీసా నిబంధనల కారణంగా భారతీయ విద్యార్థుల ఆసక్తి ఇప్పుడు ఐర్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్,  జర్మనీ వంటి అభివృద్ధి చెందుతున్న విద్యా గమ్యస్థానాల వైపు మళ్లుతోంది.

గత 5 సంవత్సరాలలో, జర్మనీలోని భారతీయ విద్యార్థుల సంఖ్య 2020లో 28,905 నుండి 2024-25 విద్యా సంవత్సరానికి 59,419కి అంటే,  రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. అంతర్జాతీయ విద్యార్థుల అతిపెద్ద సమూహంగా భారతదేశం ఇప్పుడు చైనాను అధిగమించింది, టర్కీ చాలా వెనుకబడి మూడవ స్థానంలో ఉంది.

“2035 నాటికి జర్మనీకి సుమారు ఏడు మిలియన్ల నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమవుతారని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ రీసెర్చ్ అంచనా వేస్తోంది,” అని ఆక్సిలో ఫిన్‌సర్వ్‌కు చెందిన గ్లోబల్‌ఎడ్, సీబీఓ శ్వేతా గురు తెలిపారు.

భారతీయ విద్యార్థులను ఆకర్షించే అతిపెద్ద అంశం తక్కువ ఖర్చుతో కూడిన విద్య. మూడు మిలియన్లకు పైగా విద్యార్థుల సంభాషణలపై 2025లో నిర్వహించిన లీప్ స్కాలర్ సర్వేలో, సుమారు 75% మంది తమ ప్రధాన ఆందోళనగా ఖర్చు మరియు స్థోమతను పేర్కొన్నారు. ఆ తర్వాత 70% మంది స్కాలర్‌షిప్‌ల గురించి, 58% మంది కెరీర్ అవకాశాల గురించి ప్రస్తావించారు; విశ్వవిద్యాలయ ర్యాంకింగ్‌లు మొదటి ఐదు స్థానాల్లోకి రాలేదు.

జర్మనీలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, విదేశీ విద్యార్థులకు కూడా ఎటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయవు. కేవలం సెమిస్టర్ ఫీజుగా ₹16,000 నుండి ₹38,000 (€150 నుండి €350) మాత్రమే తీసుకుంటాయి, దీనిలో సాధారణంగా స్థానిక రవాణా పాస్ కూడా కలిపి ఉంటుంది. చాలా కాలంగా అడ్డంకిగా ఉన్న భాషా అవరోధం కూడా చాలా వరకు తొలగిపోయింది: మాస్టర్స్ తో సహా, ఇప్పుడు దాదాపు 2,400 డిగ్రీలు పూర్తిగా ఆంగ్లంలోనే బోధించబడుతున్నాయి.

ఇక్కడ ఖర్చు పెట్టె మొత్తంలో అధిక శాతం  జీవన వ్యయం కోసమే ఖర్చవుతుంది.  జర్మనీకి రాకముందే, విద్యార్థులు తమను తాము పోషించుకోగలమని నిరూపించుకోవడానికి, ఒక ప్రత్యేక ఖాతాలో పూర్తి సంవత్సర జీవన వ్యయాలను కలిగి ఉండటం తప్పనిసరి. 2026 సంవత్సరానికి, ఆ మొత్తం సుమారుగా ₹12.9 లక్షలు (€11,904) ఉంది. వారు జర్మనీలో అడుగుపెట్టిన తర్వాత, ఈ మొత్తాన్ని విద్యార్థికి సుమారు ₹1.08 లక్షల చొప్పున 12 సమాన నెలవారీ వాయిదాలలో విడుదల చేస్తారు. రెండేళ్ల మాస్టర్స్ కోర్సుకు ఒక భారతీయ విద్యార్థికి, జీవన వ్యయాలతో కలిపి  ₹22 నుండి ₹28 లక్షల మధ్య ఖర్చవుతుంది. బ్రిటన్ లేదా యునైటెడ్ స్టేట్స్‌లో అదే డిగ్రీకి ₹45 లక్షల నుండి ₹70 లక్షల వరకు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా ఖర్చవుతుంది.

కొత్తగా ఇంజనీరింగ్ మరియు ఐటీ పట్టభద్రులైన వారి జీతాలు సాధారణంగా సంవత్సరానికి ₹49 లక్షల నుండి ₹70 లక్షల వరకు (€45,000 నుండి €65,000 వరకు) ప్రారంభమవుతాయి. వర్క్ వీసాపై ఉండి, సుమారు ₹49 లక్షల (€45,300) కంటే ఎక్కువ సంపాదించే అంతర్జాతీయ నిపుణులు EU బ్లూ కార్డ్‌కు అర్హత పొందవచ్చు. ఇది వారి వర్క్ పర్మిట్‌ను వేగవంతం చేస్తుంది. కాలక్రమేణా, శాశ్వత నివాసం పొందడానికి వీలు కల్పిస్తుంది.

“భారతీయ కుటుంబాల వరకూ చూస్తే, విదేశాలలో చదువుకునే విధానాన్ని జర్మనీ మార్చేసింది. యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగం వెతుక్కోవడానికి జర్మనీ 18 నెలల సమయం అందిస్తుంది. ఒక విద్యార్థికి ఇంజనీరింగ్, ఐటీ లేదా డేటా సైన్స్ వంటి రంగాలలో, తరగతి గది నుండి వృత్తిపరమైన కెరీర్ వైపు సాగే స్పష్టమైన మార్గం ఇది” అని శ్రీమతి గురు పేర్కొన్నారు.

తక్కువ నేరాల రేటు, తప్పనిసరి ఆరోగ్య బీమా మరియు సమర్థవంతమైన రీతిలో పనిచేసే ప్రభుత్వ శాఖలు , అవి అందించే సేవలు వంటి అంశాల కారణంగా  విద్యార్థులకు జర్మనీ అత్యంత సురక్షితమైన మరియు స్థిరమైన దేశాలలో ఒకటిగా నిలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -