నవతెలంగాణ – గుంటూరు: దేశవ్యాప్తంగా తమ బ్రాండ్ రిటైల్ కార్యక్రమాలను మరింత గా విస్తరించే దిశగా ఒక అడుగు ముందుకు వేస్తూ, తైవాన్ టెక్ దిగ్గజం అసుస్ ఇండియా నేడు గుంటూరులో తమ కొత్త ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. దాదాపు 280 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త స్టోర్‌లో, అసుస్ యొక్క ప్రముఖ ఉత్పత్తులైన వివో్బుక్ , జెన్ బుక్ , రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ROG) ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ డెస్క్‌టాప్‌లు, ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్‌లు, ఇతర యాక్ససరి లతో సహా విస్తృత శ్రేణి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ బ్రాండ్‌కు ఇది 9వ ఎక్స్‌క్లూజివ్ స్టోర్.
ఈ విస్తరణ గురించి అసుస్ ఇండియా ‘కన్స్యూమర్ పీసీ & గేమింగ్ బిజినెస్’ నేషనల్ సేల్స్ మేనేజర్ జిగ్నేష్ భావ్‌సర్ మాట్లాడుతూ, “భారతదేశంలో మా రిటైల్ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు వెల్లడించటానికి మేము సంతోషిస్తున్నాము. మాకు కీలకమైన మార్కెట్ అయిన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో కొత్త బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించడం అనేది దేశంలోని వివిధ ప్రాంతాల వినియోగదారులకు మా సరికొత్త ఆవిష్కరణల ద్వారా ప్రత్యేకమైన అనుభవాన్ని అందించే దిశగా ఒక కీలక మైన ముందడుగుగా నిలుస్తుందని భావిస్తున్నాము. వ్యూహాత్మక రిటైల్ విస్తరణ విధానంతో, మేము మా వినియోగదారుల కోసం మరింత అనుకూలమైన, కొత్త టచ్‌పాయింట్‌లను సృష్టించడం కొనసాగిస్తాము,” అని అన్నారు.



