Thursday, July 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్ లో ఆత్మాహుతి దాడి..14 మంది పోలీసులు మృతి

పాక్ లో ఆత్మాహుతి దాడి..14 మంది పోలీసులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌లోని బన్ను జిల్లా మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది పోలీసులు మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. దాడి అనంతరం భద్రతా బలగాలు, దుండగుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ‘ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -