Wednesday, August 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పెరిగిన ఉల్లి ధరలు

భారీగా పెరిగిన ఉల్లి ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతూ రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతుండగా, వినియోగదారులపై మాత్రం అదనపు భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP)ను క్వింటాకు రూ.2,125కు పెంచడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. మే నెలలో క్వింటా ఉల్లి ధర రూ.1,500లోపే ఉండగా, ప్రస్తుతం మార్కెట్‌లో రూ.3,000 నుంచి రూ.3,300 వరకు పలుకుతోంది. రిటైల్ మార్కెట్‌లో నెల రోజుల క్రితం రూ.100కు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు లభించిన ఉల్లి, ఇప్పుడు కిలో రూ.35-40కు విక్రయమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -