Thursday, July 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలువీరాభిమాని కోరిక తీర్చిన హీరో అఖిల్..

వీరాభిమాని కోరిక తీర్చిన హీరో అఖిల్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హీరో అక్కినేని అఖిల్ తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అనే నినాదంతో సుపరిచితుడైన గుంటూరుకు చెందిన వీరాభిమాని నాగరాజును వ్యక్తిగతంగా కలుసుకుని, గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట‌ వైరల్‌గా మారింది.

ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమా సమయంలో నాగరాజు థియేటర్ల వద్ద చేసిన సందడి అందరి దృష్టినీ ఆకర్షించింది. అఖిల్ కటౌట్‌కు పాలాభిషేకం చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, పూజలు నిర్వహించడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వీడియోలు అఖిల్ వద్దకు చేరడంతో ఆయన స్పందించి అవకాశం దొరికినప్పుడు నాగరాజును తప్పకుండా కలుస్తానని హామీ ఇచ్చారు.

ఆ మాటకు కట్టుబడి, అఖిల్ నిన్న‌ నాగరాజును తన వద్దకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూడగానే నాగరాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వెంటనే అఖిల్ కాళ్లపై పడబోగా, హీరో అతన్ని వారించి ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో నాగరాజు కన్నీళ్లు పెట్టుకుని, “ఈ జన్మకు ఇది చాలు అన్నా” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -