నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లొంగన్ గ్రామపంచాయతీలో బుధవారం గ్రామ సర్పంచ్ నాగల గిద్దె ఉషారాణి సదు పటేల్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించామని జిపి కార్యదర్శి అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఉప సర్పంచ్ కు, గ్రామస్తులకు, జిపి కార్యవర్గ సభ్యులకు వివరించారు. ప్రస్తుతము ప్రజా పాలనలో భాగంగా అన్ని వార్డుల్లోని నీటి ఎద్దడి సమస్యల పరిష్కరించాలని, శానిటేషన్ పనుల నిర్వహణ, ఉపాధి హామీ పనులను గుర్తించడం, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వాడడం నిషేధించడం, చెట్లను పెంచడం, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి కేంద్రాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, మురికి కాలువలు లేని చోట నూతనంగా నాళాలు నిర్మించడం వంటి అంశాలతో పాటు కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన సమస్యలు చర్చించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు జిపి కార్యదర్శి అనురాధ ఉపసర్పంచ్, జిపి పాలక కార్యవర్గ సభ్యులు, ఎంపీపీ ఎస్ పాఠశాల హెచ్ఎం ఆఫ్రోజ్ . అంగన్వాడీ టీచర్ అనిత, మహిళా సంఘాల సభ్యులు, యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు సదు పటేల్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
లొంగన్ గ్రామ పంచాయతీలో గ్రామసభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



