Thursday, July 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలువైభవంగా గోల్కొండ బోనాల జాతర ప్రారంభం..

వైభవంగా గోల్కొండ బోనాల జాతర ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ కు సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల జాతర అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య ప్రారంభమైంది. ఈరోజు లంగర్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్.. మంత్రి కొండా సురేఖకు సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తడం విశేషంగా నిలిచింది. శ్రీ గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా పట్టువస్త్రాలు, మొదటి ‘బంగారు బోనం’ సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ. 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కును ఆలయ కమిటీకి అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -