Thursday, July 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మక్తల్ నియోజకవర్గ ఇంచార్జిగా డీకే సీహెచ్ వెంకటన్న

మక్తల్ నియోజకవర్గ ఇంచార్జిగా డీకే సీహెచ్ వెంకటన్న

- Advertisement -

ఇంచార్జిగా డీకే సీహెచ్ వెంకటన్న నియామకం
నవతెలంగాణ-మక్తల్ 

తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే క్రమంలో తొలి విడతగా నియోజకవర్గ ఇంచార్జిల నియామకాలను చేపట్టింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధినేత్రి కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని 23 నియోజకవర్గాలకు ఇంచార్జిలను ప్రకటించారు. ఇందులో భాగంగా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జిగా డీకే సీహెచ్ వెంకటన్నను నియమించారు ఈ సందర్భంగా నూతన ఇంచార్జి డీకే సీహెచ్ వెంకటన్న మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ రాష్ట్ర అధినేత్రి కల్వకుంట్ల కవితకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మక్తల్ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరినీ సమన్వయం చేసుకుని పార్టీ విస్తరణకు కృషి చేస్తానని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెంకటన్న తెలిపారు. పార్టీ బలోపేతం కోసం త్వరలోనే గ్రామస్థాయిలో సమావేశాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -