Wednesday, March 11, 2026
E-PAPER
Homeఖమ్మంపదిలో ప్రథమ స్థానం సాధించిన బాల, బాలికలకు ఉచిత విమానయాన ప్రయాణం 

పదిలో ప్రథమ స్థానం సాధించిన బాల, బాలికలకు ఉచిత విమానయాన ప్రయాణం 

- Advertisement -

మరో ఉపాధ్యాయుడికి కూడా అవకాశం 
ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు ఊటుకూరు నాగేశ్వరరావు 
విద్యార్థులు 10లో మంచి ఫలితాలు సాధించాలి 
ఎంఈఓ దామాల పుల్లయ్
నవతెలంగాణ – బోనకల్ 

మండల స్థాయిలో పదో తరగతిలో ప్రథమ స్థానం సాధించిన బాలుర, బాలికల విభాగంలో ఒక్కొక్కరికి ఉచితంగా విమానయాన ప్రయాణ అవకాశం కల్పిస్తానని ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు ఊటుకూరి నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోని తూటీకుంట్ల ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య బుధవారం సందర్శించారు. ఈ విషయం తెలుసుకున్న ఊటుకూరి ఫౌండేషన్ అధ్యక్షుడు ఊటుకూరు నాగేశ్వరరావు పాఠశాలకు వచ్చారు.

ఎంఈఓ దామాల పుల్లయ్యతో నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాలలోనే నాగేశ్వరరావు ఈ విషయాన్ని ప్రకటించారు. మండల స్థాయిలోపదిలో ప్రతిభ చాటే ఇద్దరు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయుడితో కలిసి విమాన యాత్ర చేపిస్తామని ప్రకటించారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బాలుడికి, బాలికకు తమ వంతుగా ఈ ప్రోత్సాహక బహుమతిని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంచడానికి తాను ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించాను అని తెలిపారు. విద్యార్థులు కష్టపడి మండల స్థాయిలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులలో పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకే తమ ఫౌండేషన్ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఊటుకూరి ఫౌండేషన్ ఈ వినూత్నంగా ఉచితంగా విమాన యాన ప్రయాణానికి  ముందుకు వచ్చినందుకు ఎంఈఓ ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు  కష్టపడి చదివి మంచి మార్పులు సాధించాలని సూచించారు. విద్యార్థులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుళ్లూరి  లక్ష్మీ నరసయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి బక్క సురేష్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -