Friday, July 17, 2026
E-PAPER
Homeజిల్లాలురాష్ట్ర క్రీడా పోటీల్లో సత్తాచాటిన కామారెడ్డి పోలీసులు

రాష్ట్ర క్రీడా పోటీల్లో సత్తాచాటిన కామారెడ్డి పోలీసులు

- Advertisement -

6 పతకాలతో ఘన విజయం
నవతెలంగాణ – కామారెడ్డి

హైదరాబాద్ మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో జూలై 7-9 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చి మొత్తం ఆరు పతకాలు సాధించారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలతో జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర  శుక్రవారం ఘనంగా సన్మానించి అభినందించారు.

క్రీడల్లో రాణించడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, అవే విధి నిర్వహణలో మరింత సమర్థతకు దోహదపడతాయని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, విధులతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లా, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధించిన క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఏఆర్ డీఎస్పీ ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లా నుంచి వివిధ క్రీడల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిలో ఐదుగురు మొత్తం ఆరు పతకాలు సాధించారు.

పతక విజేతలు: ఎన్. ఉత్తేజ్ (పీసీ), కామారెడ్డి పీఎస్ – వుషూ (80 కేజీలు) స్వర్ణం, బాక్సింగ్ (80 కేజీలు) రజతం

పి. బాలరాజు (పీసీ), నిజాంసాగర్ పీఎస్ – రెజ్లింగ్ (ఫ్రీ స్టైల్ 97 కేజీలు) రజతం, జె. అంకోష్ (పీసీ), డీఏఆర్ – రెజ్లింగ్ (గ్రెకో రోమన్ 87 కేజీలు) కాంస్యం, ఎన్. ప్రభు (పీసీ), డీఏఆర్ – రెజ్లింగ్ (గ్రెకో రోమన్ 97 కేజీలు) కాంస్యం, చి. వినయ్ రెడ్డి (పీసీ), ఎస్‌ఎస్ నగర్ పీఎస్ – కరాటే (60 కేజీలు) కాంస్యం పథకాలను సాధించారన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించి కామారెడ్డి జిల్లా, తెలంగాణ పోలీసు శాఖకు మరింత కీర్తి తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, పతక విజేతలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -