నవతెలంగాణ-కుభీర్
మండలంలోని అన్ని గ్రామాలలో ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో గ్రామాల్లో ఉన్న రైతులు ఇప్పటికే విత్తనాలు ఎత్తుకొని వర్ష బావ పరిస్థితులు లేకపోవడం వల్ల ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో శుక్రవారం మండలంలోని న్యూ సౌంలీ గ్రామమలో ఏడిఏ అసం రవి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. ఎల్ ని నో ప్రభావం వల్ల వర్ష బావ పరిస్థితుల వల్ల ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు రక్షించుకొనే మార్గాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రైతులు నెలలో తేమ శాతం సంరక్షించే చర్యలు తీసుకోవాలని, పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు తీసుకోవాలని తెలిపారు. ఆయన వెంట వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఆకాష్ ,రైతులు తదితరులు ఉన్నారు.
పంటలను రక్షించే మార్గాలపై రైతులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



