నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాసకొత్తూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల శ్రీకాంత్ అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అందరి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా చిన్నవేళ శ్రీనివాస్, కార్యదర్శిగా ఎదుల రాజు,కోశాధికారి రాధారపు సాయన్న, కార్యదర్శిగా అలకుంట శేఖర్, ప్రధాన సలహాదారులు గంగాధర్, మేడం రమేష్ , కనుక గంగన్న ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ శాఖ కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరం కలిసి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సభ్యుల సహకారం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తీసుకొస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల వరకు చేరవేస్తూ, గ్రామంలో పార్టీని బలోపేతంగా చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, గ్రామ సర్పంచ్ రేవతి గంగాధర్, ఉప సర్పంచ్ మనోహర్, జిల్లా కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేలా ప్రవీణ్, జిల్లా నాయకులు దేవేందర్, మండల నాయకులు శ్రీనివాస్, మురళి, బుచ్చి మల్లయ్య, లింగారెడ్డి, కుందేటి శ్రీనివాస్, మహేందర్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.



